Metro Fair Hike: మెట్రో ఛార్జీల పెంపులో మా బాధ్యత లేదు: కేటీఆర్
మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం (State Government) పాత్ర ఏమీలేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు.
- Author : Maheswara Rao Nadella
Date : 11-02-2023 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
మెట్రో (Metro) ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థకే కట్టబెట్టిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో (Metro) యాక్ట్ ప్రకారం.. ఛార్జీలు ఎంత వసూలు చేయాలని నిర్ణయించుకునే అధికారం నిర్వహణ సంస్థలకే ఉంది.
ప్రస్తుతం మెట్రో నిర్వహణ బాధ్యతలను ఎల్ అండ్ టీ చూస్తోంది. ఛార్జీలను పెంచాలని నిర్ణయించి, అమలు చేసింది ఆ సంస్థేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్ అండ్ టీకి ఈ విషయంలో తగిన సూచనలు చేశామని మంత్రి సభలో వెల్లడించారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఊరుకోబోమని హెచ్చరించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలతో సరిసమానంగా ఉండేలా చూసుకోవాలని చెప్పామన్నారు.
Also Read: Amigos: ‘అమిగోస్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?