VH-Revanth Reddy : వీహెచ్ కు రేవంత్ హామీ
- By Sudheer Published Date - 12:39 PM, Wed - 27 March 24

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రీసెంట్ గా వీహెచ్ ..రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసందే. బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ఫై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రేవంత్ ను కలుద్దామన్న కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలోఈరోజు హన్మంతరావు తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీహెచ్ ను తన వద్దకు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ కు రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ ను వీహెచ్ కలిసినట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై వీరి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ ఆశించిన వీహెచ్.. వచ్చే అవకాశం రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంపై నిరాశ చెందవద్దని రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తామని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Chandrababu: సీఎంగా తొలి సంతకంపై చంద్రబాబు భారీ హామీ..!