Firing: ఓఆర్ఆర్‌పై కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగులు
ఔటర్ రింగ్ రోడ్డులోని తుక్కుగూడ వద్ద కాల్పుల కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.
- Author : Prasad
Date : 17-07-2022 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులోని తుక్కుగూడ వద్ద కాల్పుల కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. జార్ఖండ్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ఐరన్ లోడ్ చేసిన వాహనంతో హత్నూరా మెదక్, చందాపుర నుంచి కేరళలోని కొచ్చి వైపు వస్తున్నాడు.
లారీ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు వచ్చిన సమయంలో వైట్ కలర్ స్విఫ్ట్ కారులో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో లారీ క్యాబిన్‌పై కాల్పులు జరిపాడు. అయితే డ్రైవర్‌కు ఎలాంటి బుల్లెట్ గాయం కాలేదు. స్థానికులు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో లారీ ముందు క్యాబిన్ అద్దాలు ధ్వంసమయ్యాయి.
దుండగులు శంషాబాద్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.