HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Two More Telangana Officials Held In Sheep Distribution Scam

Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి

తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 31-05-2024 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sheep Distribution Scam
Sheep Distribution Scam

Sheep Distribution Scam: తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో సబ్లావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు. వీళ్ళు మోసపూరిత చర్యలకు పాల్పడటం ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణల నేపథ్యంలో దాదాపు 2.1 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తుంది.

గొర్రెల యూనిట్ల ఎంపిక, కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అవకతవకలకు పాల్పడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడేలా ఇద్దరు అధికారులు తమ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చెవి ట్యాగ్‌, అలాగే గొర్రెల రవాణా కోసం అంబులెన్స్‌లు, ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలను అక్రమంగా ఉపయోగించడం వంటి అక్రమాలు జరిగాయని తెలుస్తుంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో గతేడాది డిసెంబర్ 10న పశుసంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ పత్రాలు, ఫైళ్లు కనిపించకుండా పోయాయి. ఈ ఫైళ్లను గత బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు మాయం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబందించి ప్రభుత్వం వద్ద అధరాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అరెస్టు చేసిన ఇద్దరు అధికారులను నాంపల్లి కోర్టులో ఏసీబీ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Also Read: Summer: సమ్మర్ లో ఏ‌టైమ్ లో‌వాకింగ్ చేయాలో మీకు తెలుసా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Arrest
  • ACB
  • brs
  • sheep distribution scam
  • talasani srinivas yadav
  • telangana
  • TSSGDCF

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd