HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tsspdcl Gearing Up To Meet Upcoming Demand For Summer Season

TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్‌పై కీలక ఆదేశాలు

రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్‌లో కరెంట్ అధిక డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 13-01-2024 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSSPDCL
TSSPDCL

TSSPDCL: రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్‌లో కరెంట్ అధిక డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ ఇటీవల టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీనియర్‌ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అకాల విద్యుత్‌ అంతరాయాలను నివారించాలని, వీలైనంత త్వరగా కోతలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

మొత్తం 11కేవీ ఫీడర్లలో ఎనర్జీ ఆడిట్‌లు నిర్వహించి వినియోగదారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సరఫరా చేయబడిన విద్యుత్ మరియు బిల్లింగ్ మధ్య వ్యత్యాసం ఉంటే, ఆ పరిధిలోని సేవలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. కచ్చితమైన విద్యుత్ వినియోగ బిల్లులు జారీ చేయాలి. బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు అనధికారిక విద్యుత్ వినియోగాన్ని నివారించాలని, ముందస్తుగా విద్యుత్తు అంతరాయాలను నివారించాలని, అంతరాయాలు ఏర్పడితే విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన్ స్థాయిలో చేపట్టిన మెయింటెనెన్స్, రిపేర్ ఏరియాల వివరాలు, పవర్ కట్ టైమ్ వివరాలను మెసేజ్‌ల ద్వారా లేదా ప్రాంతీయ వార్తాపత్రికల ద్వారా వినియోగదారులకు ఒకరోజు ముందుగానే తెలియజేయాలని ఎండీ ఆదేశించారు. ఫిబ్రవరి 20 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున నిర్వహణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు

గత ఏడాది 9,860 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో నమోదైందని ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని, ఈసారి కూడా అదే స్థాయిలో డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది గరిష్టంగా 3,766 మెగావాట్ల డిమాండ్ ఉండగా, 79.33 మిలియన్ యూనిట్లు వినియోగించామని, ఈ ఏడాది కూడా గరిష్టంగా 4,000 మెగావాట్లు, 83-85 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Also Read: Priyanka Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసేదీ ఇక్కడ్నుంచే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • demand
  • hyderabad
  • power supply
  • Summer Season
  • telangana
  • TSSPDCL

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd