HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc Chairman Janardhan Reddy Resigns

TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.

  • Author : Gopi Date : 12-12-2023 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSPSC
Compressjpeg.online 1280x720 Image 11zon

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించి ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారికి పంపారు. రాజీనామా సమర్పించడానికి ముందు జనార్దన్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దుతో దెబ్బతిన్న జనార్దన్‌రెడ్డి హయాంలో టీఎస్‌పీఎస్సీ పనితీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కెసిఆర్ ప్రభుత్వం మే 19, 2021న TSPSC చైర్మన్‌గా జనార్దన్ రెడ్డిని నియమించింది.

1996 బ్యాచ్ IAS అధికారి అయిన జనార్దన్ రెడ్డి TSPSC చైర్మన్ గా ఉద్యోగంలో చేరడానికి ముందు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా, GHMC, HMDA కమిషనర్‌గా సహా ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. గత ప్రభుత్వం కూడా టీఎస్‌పీఎస్సీలో చైర్మన్‌తోపాటు ఏడుగురిని నియమించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రముఖ వ్యక్తులతో టీఎస్‌పీఎస్‌సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తమ పదవులకు రాజీనామా చేయాలని కోరనున్నట్లు సమాచారం. తాజాగా సీఎం రేవంత్ తో భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: JNU New Rule: జెఎన్‌యు క్యాంపస్‌లో కొత్త రూల్స్.. అనుమతి లేకుండా నిరసన చేస్తే రూ.20 వేలు ఫైన్..!

టీఎస్‌పీఎస్‌పీలో పేపర్ లీక్‌లు, నోటిఫికేషన్ వచ్చాక పరీక్షలు వాయిదా పడటం వంటి అనేక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వీటితో పోటీ పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పటికే మెగా డీఎస్సీ, గ్రూప్ 1, 2 పరీక్షలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • hyderabad
  • Janardhan Reddy
  • telangana
  • TSPSC
  • TSPSC Chairman

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd