Training Of Excise Constables: ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజు కానిస్టేబుళ్ల ట్రైనింగ్..!
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది.
- Author : Gopichand
Date : 28-03-2024 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
Training Of Excise Constables: ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది. ఎంపికైన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణనిచ్చేందుకు షెడ్యూల్ ఖరారైంది. మిగతా అభ్యర్థులను జల్లా టాస్క్ ఫోర్స్, ఎన్ ఫోర్స్మెంట్ టీమ్స్, ఎక్సైజ్ స్టేషన్స్, చెక్ పోస్టుల వద్ద ఫీల్డ్ ట్రైనింగ్ కు పంపించటం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: Bhupalpally – New York : భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో.. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’లో!
అయితే, అంతకుముందు కొత్తగా నియమితులైన 614 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తమ ఉత్తర్వులు అందుకున్న వారు విధుల్లో చేరడంలో జాప్యం చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఇంకా శిక్షణలో చేరలేదని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. బుధవారం నాడు తన X హ్యాండిల్‌లో RS ప్రవీణ్ కుమార్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో జాయిన్ అయ్యే తేదీ, ఉద్యోగాలకు రిపోర్ట్ చేయడం గురించి ఇప్పటికీ అప్‌డేట్ అందుకోలేని వారి దుస్థితిని వివరించిన ఒక ఆశావహుడు రాసిని లేఖని పోస్ట్ చేసి ఈ విధంగా రాసుకొచ్చారు.
We’re now on WhatsApp : Click to Join
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ పోస్ట్‌లో ఈ విధంగా రాశారు. ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు తీసుకున్న 614 మంది ఎక్సైజు కానిస్టేబుళ్లు ట్రైనింగ్ కు పోకుండా గత నలభై రోజుల నుండి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్సైజు శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నా చేతిలో ఏంలేదు ప్రభుత్వాన్ని అడగమని బాధితులతో అంటున్నరంట! అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా?? అది కనిపిస్తే దయచేసి దాని జాడ చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.