HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tough Times For Agriculture Under Congress Rule Ktr

KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

  • Author : Pasha Date : 12-08-2024 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR open letter to Revanth Reddy Govt

KTR : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల  బీఆర్ఎస్ హయాంలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ.. గత 8 నెలలుగా విధ్వంసాన్ని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు.

♦️ పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు 🌾
♦️ ఇప్పటికే సగం పూర్తయిన వానకాలం సీజన్‌ 🌧️
♦️అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్పష్టత ♦️అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం
♦️ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన
♦️ రైతులను వంచిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్ pic.twitter.com/fluSHdXP6Q

— BRS Party (@BRSparty) August 12, 2024

We’re now on WhatsApp. Click to Join

‘‘కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగాన్ని తెలంగాణ రాష్ట్రం చూసింది. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చింది’’ అని కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు. ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు ఇది తొలి ప్రమాద సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.. నేడు సాగయ్యే భూవిస్తీర్ణం కట్’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Also Read :China Drone : సరికొత్త డ్రోన్ రెడీ.. ఆ విషయంలో అమెరికాను దాటేసిన చైనా

కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని, పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ తెలంగాణ సర్కారుకు లేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లభించే పరిస్థితి లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని కేటీఆర్ విమర్శించారు.  ‘రైతు భరోసా’పై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తోందన్నారు. రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే తగిన శాస్తి చేస్తారని కేటీఆర్ కామెంట్ చేశారు. కేసీఆర్ హయాంకు, నేటి కాంగ్రెస్ హయాంకు ఉన్న తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. రైతుల గోసను ఇప్పటికైనా పట్టించుకోవాలని కాంగ్రెస్ సర్కారును కేటీఆర్ కోరారు.

Also Read :ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • congress
  • ktr
  • telangana

Related News

Telangana Congress Coordina

TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

ఈ కమిటీ ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాల అమలులో పార్టీ పాత్రను మరియు పార్టీ అజెండాను ప్రభుత్వ ప్రాధాన్యతలతో అనుసంధానించే పనిని చేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా ముఖ్యమంత్రి మరియు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • Telangana Petroleum Dealers Association

    Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

Latest News

  • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

  • Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Bhadrachalam Temple : భద్రాచలం ఆలయ రూపురేఖలు మారబోతున్నాయా..?

  • Petrol Shortage : పెట్రోల్ కొరత…వాహనదారులు ఇలా చేస్తే పెట్రోల్ ఎంతో ఆదా !!

  • Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం

Trending News

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

    • పంజాబ్ ఆట‌గాళ్ల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd