Tollywood Stars: ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన టాలీవుడ్ ప్రముఖులు.. హైకోర్టులో విచారణ..!
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు టాలీవుడ్ సినీప్రముఖులు (Tollywood Stars).
- By Gopichand Published Date - 01:13 PM, Thu - 3 August 23

Tollywood Stars: సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు టాలీవుడ్ సినీప్రముఖులు (Tollywood Stars). కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ (Aqua Park)కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశికిరణ్ తిక్కాతో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు.
ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్, మలేసియా వంటి దేశాలలో జరిగాయి. మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటు చేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, HMDAలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది.
Also Read: Jupally Krishna Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జూపల్లి, కేసీఆర్ పై ఘాటు విమర్శలు
నటి సదా మాట్లాడతూ.. ఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా పెరుగుతుంది. మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి సమస్య కు కారణం అవుతాయి. సహాజంగా సముద్రాలలో పెరిగే జలచరాలును పట్టి కత్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ లలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి. ఇలాంటి పార్క్ లు కాకుడా ఎన్విరాన్మెంట్ పై అవగాహాన పెంచే పార్క్ లను HMDA వారు ఏర్పాటు చేస్తే మంచిదన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూ.. పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మేము చేస్తున్న ఈ పోరాటంకు మీ మద్దతు కూడా కావాలి. వేలాది జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయి. తరువాత కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుంది. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం అవుతాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.