Actress Jayasudha: ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?
టాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో భాతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది.
- Author : Balu J
Date : 09-08-2022 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో భాతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. జయసుధ బిజెపి నాయకుడు ఈటల రాజేందర్‌తో చర్చలు జరిపినట్టు వార్తలొస్తున్నాయి. ఆగస్టు 21 న బిజెపిలో చేరాలని ఆమెను ఆహ్వానించారు. ఈటల రాజేందర్‌తో సమావేశమైన తర్వాత జయసుధ బిజెపిలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జయసుధ విజయం సాధించి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో బీజేపీలో చేరనున్న ఆమె తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే బీజేపీలో చేరే విషయమై జయసుధ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.