TTD Update: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు.. టీటీడీ కీలక అప్‌డేట్
ఇకపై ఆదివారం రోజు దర్శనం కోసం.. శనివారం నాడు ఆంధ్రా ప్రజాప్రతినిధుల నుంచి రికమెండేషన్ లెటర్లను(TTD Update) స్వీకరిస్తారు.
- By Pasha Published Date - 11:35 AM, Sun - 23 March 25

TTD Update: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ఆధారంగా భక్తులను మార్చి 24 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ మార్పును అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆదివారం నుంచి టీటీడీ స్వీకరించనుంది. ఇప్పటివరకు సోమవారం రోజు వీఐపీ బ్రేక్ దర్శనానికిగానూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల నుంచి ఆదివారం రోజు సిఫార్సు లేఖలను స్వీకరించారు. ఇకపై ఆదివారం రోజు దర్శనం కోసం.. శనివారం నాడు ఆంధ్రా ప్రజాప్రతినిధుల నుంచి రికమెండేషన్ లెటర్లను(TTD Update) స్వీకరిస్తారు. ఈవిషయాన్ని టీటీడీ గతంలోనే ప్రకటించింది.
Also Read :Sushant Rajput: మిస్టరీగా సుశాంత్‌సింగ్ మరణం.. సీబీఐ కేసులు క్లోజ్
అయితే మార్చి 25, 30 తేదీల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. మార్చి 25న (మంగళవారం) శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈనెల 30న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానం ఉన్నందున, మార్చి 29న (శనివారం) సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.
Also Read :Amaravati Update : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
సీఎం రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో..
తిరుమల దర్శనాల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లను అడుక్కోవడం ఎందుకన్నారు. తెలంగాణలోని ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని రేవంత్ సూచించారు. ‘‘ఏపీ వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా..? మనకు శివాలయాలు తక్కువున్నాయా..? తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు మన తెలంగాణలోని దేవాలయాలకు వెళ్లొచ్చు కదా’’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు పంపే సిఫారసు లేఖల విషయంలో టీటీడీ సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం.