HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Those Allegations Are False Tgsrtcs Key Statement

TGSRTC: ఆ ఆరోప‌ణ‌లు అవాస్త‌వం.. టీజీఎస్‌ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) రద్దు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.

  • Author : Gopi Date : 13-04-2025 - 8:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGSRTC
TGSRTC

TGSRTC: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) యాజమాన్యం, కొందరు యూనియన్ నాయకులు సంస్థపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఉద్యోగులు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గందరగోళానికి గురికావొద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేసింది.

యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) రద్దు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది. ఎస్‌ఆర్‌బీఎస్ మూసివేత ప్రతిపాదనే సంస్థ ముందుకు తీసుకురాలేదని, ఈ అంశాన్ని కావాలనే తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది. సంస్థలో ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని యాజమాన్యం తేల్చిచెప్పింది.

Also Read: TTD Chairman BR Naidu: టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర జ‌రుగుతోంది: చైర్మ‌న్ బీఆర్ నాయుడు

గత మూడున్నరేళ్లుగా కొందరు యూనియన్ నాయకులు తమ మనుగడ కోసం ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఉద్యోగులు ప్రతిసారీ ఈ కుట్రలను తిప్పికొట్టి, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మద్దతు తెలిపారని యాజమాన్యం పేర్కొంది. సంస్థకు ఎంతో కాలం సేవలందించి, పదవీ విరమణ తర్వాత బయటకు వెళ్లి నిరాధార ఆరోపణలతో ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని హితవు పలికింది.
యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఉద్యోగులు నిరాధార ఆరోపణలను నమ్మరని, సంస్థ వెన్నంటి నిలబడతారని యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది. యూనియన్ నాయకులు ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Staff Retirement Benefits Scheme
  • telangana
  • Telangana RTC
  • TGSRTC
  • union leaders

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

Latest News

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

  • Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

  • Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd