Indiramma House Status: మొబైల్‌తో ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు ఇలా!
మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? వంటి వివరాలను తెలుసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఒ లింక్‌ను ఏర్పాటు చేసింది.
- Author : Gopichand
Date : 14-02-2025 - 4:34 IST
Published By : Hashtagu Telugu Desk
Indiramma House Status: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నా కాంగ్రెస్ సర్కార్ సామాన్యుడికి ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం అమలు చేసింది. ఇప్పటికే గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు (Indiramma House Status), రేషన్ కార్డులు, భూమిలేని పేదలకు రూ. 12 వేలు లాంటి హామీలను ప్రభుత్వం అమలు చేసి అర్హులైన లబ్ధిదారులను సైతం ఎంపిక చేసింది. అయితే చాలా మంది ఎంపికైన వారు తమ పేరు ఎక్కడ చెక్ చేసుకోవాలని మీ సేవా కేంద్రాల చుట్టూ.. ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం యూఆర్ఎల్‌ను క్రియేట్ చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తు ఏ దశలో ఉంది? ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా? ఇల్లు మంజూరైందా? లేదా? మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? వంటి వివరాలను తెలుసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఒ లింక్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తుదారులు తమ పనిని మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. తాము ఉన్న చోటు నుంచే దరఖాస్తు స్దితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Also Read: KTM 390 Duke: కేటీఎం ప్రీమియం బైక్ 390 డ్యూక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!
ఆధార్ నెంబర్/ మొబైల్ నెంబర్/ రేషన్ కార్డు నెంబరుతో అన్నివివరాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి గ్రీవెన్స్ స్టేటస్‌లోని సెర్చ్‌లోకి వెళ్లి తమ దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్‌సైట్ ద్వారానే తెలియజేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ సర్వే కాకుంటే అందుకు తగిన సమాధానాలు ఇస్తూ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ లింక్ ద్వారా తెలుసుకోవాలంటే ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
LINK: https://indirammaindlu.telangana.gov.in