Minister Komatireddy : రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు అన్నదే ఉండదు – మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy : 38 కోట్ల రూపాయలతో మూడు డబుల్ రోడ్లు మరియు హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని , ప్రత్యేకంగా నల్లగొండ జిల్లాకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని
- Author : Sudheer
Date : 29-10-2024 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో ఇక ఎక్కడ కూడా మట్టి రోడ్ (Matti Road) అనేది కనిపించదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy ) అన్నారు. నల్లగొండ జిల్లాలో రహదారుల అభివృద్ధిపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులను నిర్మించనున్నారని తెలిపారు. 38 కోట్ల రూపాయలతో మూడు డబుల్ రోడ్లు మరియు హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని , ప్రత్యేకంగా నల్లగొండ జిల్లాకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, శ్రీశైలం- దేవరకొండ రహదారిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కనగల్ జంక్షన్‌ను 8 కోట్ల రూపాయలతో వెడల్పు చేయడం జరుగుతోందని, అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు.
తిప్పర్తి జంక్షన్‌ను 9 కోట్లతో వెడల్పు చేసే పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మిర్యాలగూడలో 147 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారి పనులు ప్రారంభం అయ్యాయని , పగిడిమర్రి-మదనాపురం మరియు ఇతర రోడ్ల పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పుకొచ్చారు. రోడ్లతో పాటు, చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరగడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. నవంబర్‌లో నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 3500 ఇళ్ళను నిరుపేదలకు ఇవ్వడం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంటి కార్యక్రమాలు కూడా ప్రణాళికలో ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also : Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు – బ్రదర్ అనిల్‌కుమార్