MLA Participated In Funeral: కాంగ్రెస్ పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు.
- Author : Gopichand
Date : 01-12-2024 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
MLA Participated In Funeral: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ మాజీ ఎంపీటీసి, ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుచరుడు శ్రీధర్ గౌడ్ గత రాత్రి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో మరణించగా ఆయన వైద్యానికి అయిన మొత్తం ఖర్చులు ఎమ్మెల్యే చెల్లించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు ఇప్పించడం జరిగింది. ఆదివారం కళ్యాణి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అంత్యక్రియల్లో (MLA Participated In Funeral) పాల్గొన్నారు.
Also Read: Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
ముందుగా ఎమ్మెల్యే.. శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొని శ్రీధర్ గౌడ్ పాడేను ఎమ్మెల్యే మదన్ మోహన్ మోశారు. శ్రీధర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధలో ఉన్న శ్రీధర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. చాలా సంవత్సరాల నుండి నుండి తనతో చాలా దగ్గరగా పని చేసాడని, మంచి నాయకున్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ఎమ్మెల్యే భావోద్వేగాన్ని తెలియజేశారు. అదేవిధంగా శ్రీధర్ గౌడ్ కుటుంబానికి ఎల్లవేళలా సాయం చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.