HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Largest Steel Bridge In Hyderabad

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

  • Author : Vamsi Chowdary Korata Date : 06-01-2026 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Largest Steel Bridge hyderabad
Largest Steel Bridge hyderabad

Largest Steel Bridge హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.

  • నగరంలో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
  • రూ.4,263 కోట్లతో నిర్మిస్తోన్న హెచ్ఎండీఏ
  • ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మాణం

హైదరాబాద్ నగరంలో త్వరలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 4,263 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తీరుతాయి. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మొత్తం 18.15 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో.. 11.52 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి రానుంది. ఆ తర్వాత హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మిస్తారు.

ప్రస్తుతం నగరంలో ఒక స్టీల్ బ్రిడ్జి ఉంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని నిర్మించారు. ఈక్రమంలో హెచ్ఎండీఏ (HMDA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ 2 ను స్టీల్ బ్రిడ్జిగా నిర్మించాలని నిర్ణయించారు. దీని నిర్మాణం పూర్తయితే.. ఇది నగరంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జిగా నిలవనుంది. హెచ్‌‌‌‌ఎండీఏ చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి డెయిరీ ఫామ్ వరకు 5.18 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్– 1 నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండో ఎలివేటెడ్ కారిడార్-2ను త్వరలో ప్రారంభించనున్నారు.

కారిడార్-2 నిర్మాణానికి సంబంధించిన అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 192 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనిలో 114.50 ఎకరాలు రక్షణ శాఖ భూములు కాగా.. మిగిలిన భూమి ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 967 నిర్మాణాలను తొలగించనున్నారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే.. నగరవాసులు సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు, అక్కడి నుంచి రాజీవ్ రహదారికి వెళ్లడం మరింత సులువు అవుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నిత్యం భారీ ట్రాఫిక్‌తో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, సిద్ధిపేట, గజ్వేల్ వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌లు నిర్మిస్తోంది. ఇప్పటికే భూసేకరణ కసరత్తు పూర్తి చేశారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఎన్‌హెచ్-44 రూట్‌లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని అధికారులు వెల్లడించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Largest Steel Bridge
  • Shamirpet
  • telangana

Related News

Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

ponnam prabhakar  తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబ

  • Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

    హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

Latest News

  • Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

  • Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

  • Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

  • NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు

Trending News

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd