HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Date For The New Party Has Been Decided Kavitas Key Statement

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • Author : Vamsi Chowdary Korata Date : 19-02-2026 - 1:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha
kalvakuntla kavitha  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ‘తెలంగాణ’ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు.

హైదరాబాద్‌లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించి అన్యాయం చేశారని అన్నారు.

స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేశారని ఆరోపించారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bodhan
  • Bodhan constituency
  • kalvakuntla kavitha
  • MLC K Kavitha
  • new political party
  • siddipet
  • Siddipet constituency
  • telangana jagruthi
  • Telangana Party
  • telangana politcs

Related News

Kalvakuntla Kavitha

జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Kalvakuntla Kavitha :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే… మున్స

    Latest News

    • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd