Hyderabad: హైదరాబాద్‌లో ‘థ్యాంక్యూ మోదీజీ’ హోర్డింగ్స్ వెల్లువ
కేంద్ర బడ్జెట్ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాద్ లో
- By Maheswara Rao Nadella Published Date - 03:15 PM, Wed - 8 February 23

కేంద్ర బడ్జెట్ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాద్ (Hyderabad) లో భారీ కటౌట్స్, హోర్డింగ్స్ . బడ్జెట్ లో వివిధ కేటాయింపులపై ధన్యవాదాలు తెలుపుతూ వీటిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మధ్య తరగతి ప్రజలు, డబుల్ బెడ్రూం బాధితుల సంఘం, హైదరాబాద్ (Hyderabad) నర్సింగ్ విద్యార్థులు, గిరిజన విద్యార్థి సమాఖ్య పేరిట ఈ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి. ‘దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ హైదరాబాద్ నర్సింగ్ విద్యార్థుల పేరిట ఓ హోర్డింగ్ కనిపించింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూం బాధితుల సంఘం పేరిట మరో హోర్డింగ్ ఏర్పాటైంది. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రంలోని అధికార బీఆర్ ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ శ్రేణులు వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Also Read: Food Items: ఈ ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకోకూడదు..!