Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-3 పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.
- By Pasha Published Date - 11:52 AM, Sun - 10 November 24

Group 3 : గ్రూప్ – 3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. దాదాపు 1380 గ్రూప్-3 పోస్టుల కోసం 5.36 లక్షల మందికిపైగా అప్లై చేసుకున్నారు. ఇక వీరంతా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read :Dev Deepawali : నవంబరు 15 వర్సెస్ 16.. ‘దేవ్ దీపావళి’ ఎప్పుడు ?
- గ్రూప్-3 పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.
- ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది.
- 17వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.
- 18వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్షను నిర్వహిస్తారు.
- ఉదయం జరిగే పరీక్షలకు 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
- తొలిరోజు పేపర్-1 పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు అభ్యర్థులు ఉపయోగించుకోవాలి.
- ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు అభ్యర్థులు దాచుకోవాలి.
- మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే టీజీపీఎస్‌సీ టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ 040-2354 2185కు కాల్ చేయాలి. 040-2354 2187 నంబరులో కూడా సంప్రదించవచ్చు. Helpdesk@tspsc.gov.in కు ఈ-మెయిల్ చేయొచ్చు.
Also Read :Russia : అమెరికాకు చెక్.. ఉత్తర కొరియాతో పుతిన్ మెగా డీల్.. ఏమిటి ?
నవంబరు 20 వరకు టెట్ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో టెట్ కోసం ఈ నెల 7 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20 వరకు అవకాశం ఇచ్చారు. 2025 జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు నిర్వహించారు. త్వరలో జరగబోయేది రెండో టెట్ పరీక్ష. టెట్‌కు ఈసారి కూడా భారీ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.