Kavitha Reaction: తెలంగాణ తల వంచదు.. లిక్కర్ స్కామ్ పై కవిత రియాక్షన్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవిత రియాక్ట్ (MLC Kavitha) అయ్యారు.
- By Balu J Published Date - 11:03 AM, Wed - 8 March 23

తెలుగు రాష్ట్రాల (Telugu states) తో పాటు దేశవ్యాప్తంగానూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న హైదరాబాద్ బిజినెస్ మేన్ పిళ్లైను అరెస్ట్ చేయడంతో లిక్కర్ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే తదుపరి అరెస్ట్ కల్వకుంట్ల కవితనేని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. అయితే అనుకున్నట్టుగానే కవిత సమన్లను జారీ చేసింది ఈడీ. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవిత రియాక్ట్ (MLC Kavitha) అయ్యారు.
‘‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు (MLC Kavitha) నోటీసులు జారీ చేసింది.
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం’’ అని కవిత (MLC Kavitha) రియాక్ట్ అయ్యారు.
Also Read: Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ నుంచి ఓ డాలర్ పిలగా సాంగ్ రిలీజ్!

Related News

Rahul Gandhi: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా.. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం..
రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామరం మండలంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు..