MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ?
ఇటీవలే సమావేశమైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రిపై(MLAs Secret Meeting) ఆగ్రహంగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- By Pasha Published Date - 08:49 AM, Sun - 2 February 25

MLAs Secret Meeting : విపక్ష పార్టీలు తెలంగాణ కాంగ్రెస్‌పై విష ప్రచారానికి తెగబడుతున్నాయి. సీఎం రేవంత్ సారథ్యంలో సజావుగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారులో అనిశ్చితి తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఈవిషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు వత్తాసు పలికే మీడియా సంస్థలు కూడా కట్టు కథలు అల్లుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో సమావేశమైతే దానిపై అనవసర రాద్ధాంతానికి తెర లేపుతున్నాయి. కట్టు కథలు అల్లి ప్రజల్లోకి వదులుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు యత్నిస్తున్నాయి.
Also Read :Union Budget 2025 : తెలంగాణకు అన్యాయం – కేటీఆర్
బేధాభిప్రాయాలు సహజం
ఇటీవలే సమావేశమైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రిపై(MLAs Secret Meeting) ఆగ్రహంగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో సమావేశాలు అనేవి కామన్. రాజకీయ నాయకులు పరస్పర సంబంధాలు పెంచుకోవడం అనేది ఆది నుంచీ నడుస్తున్న అంశమే. అందులో కొత్త విషయమేం లేదు. అయినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా.. మచ్చలేని రేవంత్ సర్కారుపై బురదజల్లేందుకే ఈ అంశాన్ని భూతద్దంలో చూపెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు యత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయ పార్టీల్లో చిన్నపాటి వైరుధ్యాాలు, బేధాభిప్రాయాలు సహజం.
Also Read :Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్
రేవంత్‌ను చూసి గర్విస్తున్నారు
బీఆర్ఎస్‌లో కుటుంబ రాజకీయం నడుస్తుంది. బీజేపీలో సైద్ధాంతిక రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక రాజకీయం నడుస్తుంది. అందుకే కాంగ్రెస్‌లోని నేతలకు భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ ఎక్కువగా లభిస్తుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించవు. తమ కుటుంబం నుంచి కాకుండా వేరే కుటుంబం ఎవ్వరూ అగ్రనేతగా ఎదగడాన్ని వాళ్లు చూస్తూ ఓర్వలేరు. సంక్షేమ పథకాల అమలుతో రేవంత్ సర్కారుకు తెలంగాణ ప్రజల్లో మరింత జనాదరణ పెరిగింది. కాంగ్రెస్‌లో బలమైన నేతగా సీఎం రేవంత్ ఎదిగారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ వంటి వారు తెలంగాణ రాజకీయాలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రేవంత్ సూచన, సిఫార్సు తప్పకుండా తీసుకుంటున్నారు. సామాన్యుడి స్థాయి నుంచి అగ్రనేత స్థాయికి ఎదిగిన రేవంత్‌ను చూసి తెలంగాణ ప్రజలు గర్విస్తున్నారు.