HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Tet Hall Tickets Released

TET : తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.

  • Author : Latha Suma Date : 27-12-2024 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Tet hall tickets released
Telangana Tet hall tickets released

TET : టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్‌) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. 2025 జనవరి 2 నుంచి 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహిస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. టెట్ పరీక్ష రాసేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.

విద్యాశాఖ ఇప్పటికే ప్ర‌క‌టించిన టీజీ టెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే సంవ‌త్స‌రం 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది.

తెలంగాణ టెట్‌ పేపర్‌–1ను ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు– 150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–2 (30 ప్రశ్నలు– 30 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (30 ప్రశ్నలు– 30 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (30 ప్రశ్నలు – 30 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 6 ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.

Read Also: Manmohan Singh : మన్మోహన్ సింగ్‌-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Teacher Eligibility Test
  • telangana
  • Telangana Education Department
  • TET

Related News

The chicken curry that took the life of the father

Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిన

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

  • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

  • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

  • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

  • Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd