HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Raising 2047

‘Telangana Raising 2047’ : తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏంటి..? ప్రభుత్వ లక్ష్యాలేంటీ..?

'Telangana Raising 2047' : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంగా, ఈ డాక్యుమెంట్‌ను 2025 డిసెంబర్ 9న విడుదల చేయాలని భావిస్తున్నారు

  • Author : Sudheer Date : 25-06-2025 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rising 2047
Telangana Rising 2047

తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” (Telangana Raising 2047) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విజన్ డాక్యుమెంట్ తయారుచేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంగా, ఈ డాక్యుమెంట్‌ను 2025 డిసెంబర్ 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ దిశగా ఐదు ప్రధాన రంగాలలో అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ కార్యాచరణను రూపొందిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణను దేశంలోనే శ్రేష్ఠమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

మొదటిగా ఆర్థికాభివృద్ధి పై దృష్టి సారించిన ప్రభుత్వం, రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యకాలికంగా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను చేరుకోవడమే ప్రధాన టార్గెట్. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఐటీ, ఫార్మా, పర్యాటక, లాజిస్టిక్స్, సినీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, మెట్రో ఫేజ్-2, రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

మూడో దశలో మానవ వనరుల అభివృద్ధి కూడా ముఖ్యంగా ఉంది. యువతకు ఉద్యోగావకాశాలు పెంచేలా నైపుణ్య ప్రోత్సాహం, డిజిటల్ లెర్నింగ్, ఐటీఐల్లో ఆధునిక విద్య, స్పోర్ట్స్, స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సాధికారత కోసం 66 లక్షల స్వయం సహాయక గ్రూపుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయనుంది. ఇక ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడమే లక్ష్యం. ఉచిత విద్యుత్, బోనస్ ధరలు, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణాలు లాంటి పథకాలు అందరికీ చేరేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించనున్నారు.

చివరగా పారదర్శక పాలన తెలంగాణకు మార్గదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నిర్ణయం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండేలా పాలనను తీర్చిదిద్దే లక్ష్యంతో టీఎస్‌పీఎస్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను బలోపేతం చేయనుంది. రాష్ట్రాన్ని డ్రగ్‌ రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మొత్తం మీద, తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఐదు కీలక రంగాల ఆధారంగా రూపొందుతూ, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మక దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Telangana Raising 2047'
  • $3 trillion economy
  • CM Revanth Reddy
  • Telangana Rising 2047 targets

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd