Telangana@Davos: దావోస్ లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్..!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్...వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగింది.
- By Hashtag U Published Date - 05:44 AM, Sat - 28 May 22

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్…వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగింది. మంత్రి కేటీఆర్ క్రుషి ఫలితంగా సుమారు 4200కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలతోపాటు పెట్టుబడి ప్రకటనలు కూడా ప్రకటించాయి. ఈ సారి భారత్ నుంచి దావోస్ లో పాల్గొన్న పలు పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చితే తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత్ కు చెందిన ఎన్నో కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ ను ప్రశంసించారు. జ్యూరిక్ నగరంలో ZFకంపెనీతో సమావేశం నిర్వహించి..తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. సుమారు మూడు వేల మంది ఉద్యోగులతో తన హైదరాబాద్ కార్యాలయం తన అతిపెద్ద కార్యాలయంగా మారుతుందని కంపెనీ ప్రకటించింది.