CM Revanth Reddy : ఏఐ డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 07:01 PM, Fri - 18 April 25

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్ భాగస్వామ్య రోడ్‌షోలో పాల్గొన్నారు. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈవీ, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను రేవంత్ బృందం ప్రదర్శించింది.
Read Also: Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
తెలంగాణలో సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం ఇస్తోంది. నిపుణులు ఉన్నందున ఏఐ డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్‌టీటీ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం సుస్థిరంగా ఉంటుంది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పెట్టుబడులు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
జపాన్ పర్యటనలో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక, రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.