Caste Census : తెలంగాణ నేడు విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టింది: సీఎం రేవంత్ రెడ్డి
Caste Census : ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాగే సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, పలు విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా మేము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
- By Latha Suma Published Date - 06:47 PM, Sat - 9 November 24

CM Revanth Reddy : తెలంగాణలో ఈరోజు నుండి కులగణన సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలంగాణ నేడు కులాల సర్వే గణన ప్రారంభంతో విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టింది. మా నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణలో అన్ని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుంది. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాగే సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, పలు విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా మేము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే కుటుంబ సభ్యుల వివరాలతో ఇంటింటి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సర్వే పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీల వారు పాజిటివ్ గా తీసుకుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సర్వేను నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. కొందరూ సర్వేను కొన్ని ఇండ్లను మాత్రమే చేస్తున్నారు. మరికొన్ని ఇండ్లను వదిలేసి చేయడం గమనార్హం.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈ సర్వేపై మాట్లాడుతూ..తెలంగాణాలో నిర్వహించనున్న కుల గణన వల్ల అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచుతామని అన్నారు. రాజకీయాల్లోనూ వాటి వాటాను నిర్ణయించేందుకు. ఈ గణన ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణాలో జరుగుతుంది. కుల గణన మాత్రమే కాదని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను నిర్దేశించే ప్రక్రియ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యక్తితో అసమానత్వం గురించి మాట్లాడానన్న రాహుల్ గాంధీ.. అతను అనేక అసమానతలపై తనకు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వాటిలో.. అతిపెద్ద వివక్ష అయిన కులవ్యవస్థ గురించి లేదన్న రాహుల్.. ఆ కారణంగానే ఆ విశ్లేషణను తాను అసంపూర్ణమైందని చెప్పినట్లు వెల్లడించారు.
Read Also: KCR Comments: వందశాతం గెలుపు మనదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు