HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs President Kcr Key Comments On Congress Party

KCR Comments: వంద‌శాతం గెలుపు మ‌న‌దే.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు.

  • Author : Gopi Date : 09-11-2024 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Comments
KCR Comments

KCR Comments: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR Comments) చాలా రోజుల త‌ర్వాత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పూర్తి ప‌రిస్థితి అర్థ‌మైంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం బీఆర్ఎస్ పార్టీదేన‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌లు కీల‌క విష‌యాలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత నెలకొన్న ప‌రిస్థితులు, బీఆర్ఎస్ నాయ‌కులపై జ‌రుగుతున్న అక్ర‌మ కేసుల‌పై ఆయ‌న స్పందించారు. అలాగే త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏం చేశారో కూడా వివ‌రిస్తూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదు. మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి, కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

వంద‌శాతం మ‌న‌మే గెలుస్తాం: కేసీఆర్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద‌శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చి 11 నెల‌లు అయిపోయింది. ప్ర‌జ‌లు ఏం కోల్పోయారో వాళ్ల‌కు అర్థ‌మైంది. ప్ర‌జ‌లు మ‌న‌పై విశ్వాసంతో ఉన్నారు. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. అరెస్టుల‌కు భ‌య‌ప‌డేది లేదు అని కేసీఆర్ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌస్‌లో ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేశారు.

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా 100 సీట్లు గెలుస్తాం: హ‌రీశ్ రావు

తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా 100 సీట్లు గెలుస్తామ‌ని బీఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో రైతులు, విద్యార్థులు, పోలీసులు.. ఇలా అన్ని వ‌ర్గాల వారు రోడ్డు ఎక్కుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. మంత్రులు గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నార‌ని, భూమిపై తిరిగితే ప్ర‌జ‌లు క‌ష్టాలు తెలుస్తాయ‌ని ఆయ‌న సంగారెడ్డి రైతు దీక్ష‌లో అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS President KCR
  • congress
  • harish rao
  • KCR Comments
  • politics
  • telangana
  • ts politics
  • viral news

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Pm

    KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Latest News

  • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

  • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

  • IPL 2026 : CSK కు బిగ్ షాక్

  • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

  • నెతన్యాహు హంగేరీ వస్తే అరెస్ట్ ఖాయం: కొత్త ప్రధాని

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd