HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Govt To Launch Insurance Scheme For Sccl Employees

Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు

  • Author : Sudheer Date : 26-02-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Singareni Insurance Scheme
Singareni Insurance Scheme

సింగరేణి కార్మికులకు (SCCL employees) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని (Rs 1 crore Accident Insurance Scheme) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ (Telangana Singareni)పై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కిందని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. 43వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.

2014లో మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు. ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలను, 25వ తేదీ వరకు విడతల వారీగా చెల్లించిన ఘనుడు కేసీఆర్ అని సెటైర్లు వేశారు. తాము అధికారంలోకి వచ్చాక మొదటి నెల 4వ తేదీన, రెండో నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు బంధు మార్చి 31లోగా దశలవారీగా చెల్లిస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాలకు నిధులు ఇబ్బంది అవుతుందని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

Read Also : Dulquer Salman Lucky Bhaskar : లక్కీ భాస్కర్ తో లక్కీ ఛాన్స్ పట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Rs 1 crore Accident Insurance Scheme
  • Singareni Insurance Scheme
  • telangana

Related News

Revanth's victory regarding the Metro Rail

Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

1. మెట్రో రైల్ విజయం తన అచంచలమైన విశ్వాసం మరియు అలుపెరుగని పట్టుదలతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతికి తనే ఒక ఛాంపియన్ అని మరోసారి నిరూపించుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఐఆర్‌ఎఫ్‌సి (IRFC) రుణాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి హామీని పొందడం ద్వారా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకత్వ శైలిని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd