Telangana History: అధికారిక వెబ్‌సైట్ నుండి కేసీఆర్ ఆనవాళ్లు గల్లంతు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాష్ట్ర అధికార చిహ్నమైన తెలంగాణ తల్లి పాటను మార్చేవిధంగా నిర్ణయం తీసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 03:16 PM, Wed - 20 March 24

Telangana History: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాష్ట్ర అధికార చిహ్నమైన తెలంగాణ తల్లి పాటను మార్చేవిధంగా నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ చరిత్రపై కన్ను వేసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుండి తెలంగాణ చరిత్ర పేజీని తొలగించింది సీఎం రేవంత్ ప్రభుత్వం. మరి ఈ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటనేది తెలియనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తెలంగాణ చరిత్రను మార్చగలదా అన్నది చూడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా వందలాది యూట్యూబ్ వీడియోలను ఆ ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయాలని భావించింది. ఎందుకంటే అవి మునుపటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మరియు అప్పటి సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో జరిగినవి. ఇదివరకు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ జ్ఞాపకాలను భూమ్మీద నుంచి చెరిపేస్తానని ప్రమాణం చేశారు. తెలంగాణ చరిత్రను తిరగరాస్తానన్నారు. తెలంగాణ ఇవ్వడంలో జరిగిన జాప్యాన్ని, బలిగొన్న జీవితాలను, రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన పోరాటం గురించి గత ప్రభుత్వం అధికారిక సైట్ లో పెట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆనవాళ్లను రేవంత్ గవర్నమెంట్ తీసేసి సరికొత్త చరిత్రను సృష్టించాలని అనుకుంటున్నారు.
CM @revanth_anumula's government has now removed the history page from the official website of the #Telangana Government.
So, will #Congress now rewrite the history of Telangana as per the instructions and agenda of the Nehru-Gandhi family? pic.twitter.com/HamUb2nKOg
— BJPShanthikumar (@BJPShanthikumar) March 20, 2024
Also Read: CPI Narayana Injured : హాస్పటల్ లో చేరిన సీపీఐ నేత నారాయణ