HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Telangana Govt Hikes Da For Employees Pensioners By 2 73 Percent

DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది.

  • By Gopichand Published Date - 06:50 AM, Tue - 24 January 23
DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు ఎనిమిది వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఉన్న డీఏను 17.29 నుండి  20.02 శాతానికి పెంచింది ప్రభుత్వం,  డీఏ పెంపుతో  4.40 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది.  డీఏ పెంపు కారణంగా  2.38 లక్షల మంది పెన్షనర్లకు  కూడా  ప్రయోజనం  కలగనుంది. ఎనిమిది విడతల్లో ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

సీఎం కేసీఆర్ గారు నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1/2 pic.twitter.com/hZfp10gipA

— Harish Rao Thanneeru (@trsharish) January 23, 2023

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4లోగా ప్రక్రియ పూర్తి.. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అనుమతి.. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లోగా అప్పీళ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు సమగ్రంగా చర్చించారు. చర్చలు సఫలం కావడంతో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఖరారు చేశారు.

Telegram Channel

Tags  

  • DA For Pensioners
  • Dearness Allowance
  • employees
  • Pensioners
  • telangana govt

Related News

Amazon Employees: అమెజాన్ హెచ్చరిక.. 2300 మంది ఉద్యోగులకు నోటీసులు!

Amazon Employees: అమెజాన్ హెచ్చరిక.. 2300 మంది ఉద్యోగులకు నోటీసులు!

దాదాపు 2 వేల 300 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు అమెజాన్‌ (Amazon) నోటీసులు జారీ చేసింది.

  • Increments for Employees: ఎక్కువ మంది పిల్లల్ని కనే ఉద్యోగినులకు ఇంక్రిమెంట్స్.. ఎందుకో తెలుసా!

    Increments for Employees: ఎక్కువ మంది పిల్లల్ని కనే ఉద్యోగినులకు ఇంక్రిమెంట్స్.. ఎందుకో తెలుసా!

  • Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. స్టార్టప్ క్రేజీ ఐడియా..

    Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. స్టార్టప్ క్రేజీ ఐడియా..

  • Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?

    Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?

  • CS Shantha Kumari: తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి!

    CS Shantha Kumari: తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి!

Latest News

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: