New Mandals : మరో 3 కొత్త మండలాలు.. ఏ జిల్లాల్లో అంటే..
New Mandals : కొత్తగా మరో 3 మండలాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 06:56 AM, Wed - 4 October 23
New Mandals : కొత్తగా మరో 3 మండలాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. కొత్తగా నిర్మల్ జిల్లాలో రెండు మండలాలు(మాలెగావ్, బెల్తాడోరా), వనపర్తి జిల్లాలో ఒక మండలాన్ని(ఏదుల) ఏర్పాటు చేయనున్నారు. వనపర్తి జిల్లాలో ఏర్పాటుకానున్న ఏదుల మండలం పరిధిలో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలు ఉంటాయి. నిర్మల్ జిల్లాలో ఏర్పాటయ్యే మాలేగావ్ మండలంలో సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని గ్రామాలను కలపాలని ప్రతిపాదించారు.
We’re now on WhatsApp. Click to Join
నిర్మల్ జిల్లాలో ఏర్పాటయ్యే బెల్తాడోరా మండలంలోో ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలను కలపాలని ప్రతిపాదించారు. ఈమేరకు వివరాలతో తెలంగాణ సర్కారు ప్రైమరీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ మండలాల్లో గ్రామాల కూర్పు, ఇతర అంశాలపై పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ (New Mandals) జారీ చేయనున్నారు.
Also read :Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
Related News
Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Summer Holidays: తెలంగాణ(Telangana)లో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విద్యార్థులకు వేసవి సెలవుల(Summer Holidays)ను ప్రకటించింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో.. వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హాఫ్ డ