Special Shows: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు శుభవార్త.. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త చెప్పింది. ఈ రెండు సినిమాల ప్రత్యేక షోల (Special Shows)కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి.
- Author : Gopichand
Date : 11-01-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త చెప్పింది. ఈ రెండు సినిమాల ప్రత్యేక షోల (Special Shows)కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి. సినిమా పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉండే తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకుంది. సంక్రాంతి బరిలో రానున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు శుభవార్త అందించింది. విడుదల రోజే ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీటి ప్రకారం వీరసింహారెడ్డి షోలు 12వ తేదీ ఉదయం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు అంటే 13వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షోలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన స్క్రీన్లలో ఈ స్పెషల్ షోలను నిర్వహించడానికి ఎగ్జిబిటర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇద్దరు హీరోల అభిమానులలో హైప్‌ను పెంచుతుంది. వీర సింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా, వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుంది.
Also Read: Amit Shah to Telangana: మిషన్ తెలంగాణ షురూ.. ఈనెల 28న రాష్ట్రానికి అమిత్ షా
వీరసింహారెడ్డిలో బాలకృష్ణతో పాటు కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. నటి హనీ రోజ్ కీలక పాత్రలో కనిపించనుండగా, శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పాత్ర దాదాపు నలభై నిమిషాలు ఉండనుంది. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కేథరిన్ థ్రెసా కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది.