HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Finally Working On Increasing Aasara Pensions

ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు

  • Author : Sudheer Date : 05-01-2026 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aasara Pension
Aasara Pension

తెలంగాణ లో అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఆసరా పింఛన్లను పెంచలేదని అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ, ఎట్టకేలకు ప్రభుత్వం పింఛన్ల పెంపుపై కసరత్తులు మొదలుపెట్టింది. తాజాగా హైదరాబాద్ మలక్‌పేటలో గల దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయీస్‌ బ్రెయిలీ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్లో మాట్లాడగా.. త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అంధ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా.. దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే దివ్యాగులకు రూ.6000 పెన్షన్ అందజేస్తామని తెలిపారు.

తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు. అయితే ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 4,016 అందుతుండగా.. వృద్ధులు, ఇతరులకు రూ. 2,016 పింఛనుగా ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం.. దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న రూ. 4,016 ను రూ. 6,000 కు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత.. దశలవారీగా మిగిలిన వారికి పెంచిన పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Aasara Pension Increase

Aasara Pension Increase

దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాలని కూడా నిర్ణయించారు. పదో తరగతి వరకే ఉన్న బ్రెయిలీ లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విస్తరించడం ద్వారా అంధ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛన్ల పెంపుతో పాటు… అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aasara Pension
  • aasara pension increase
  • Adluri Laxman Kumar
  • cm revanth
  • Congress Govt
  • telangana

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd