HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Congress Selfie Challange Program

Congress : కాంగ్రెస్ సెల్ఫీ ఛాలెంజ్‌.. కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిపై క్యాంపెయిన్‌

ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి

  • By Prasad Published Date - 12:58 PM, Thu - 27 July 23
  • daily-hunt
Bhatti
Bhatti

ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్ణయించుకున్నారు. ఇటీవలే పీపుల్స్ మార్చ్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింన భట్టి విక్రమార్క.. తాజాగా సెల్ఫీ క్యాంపైన్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ప్రజలకు గుర్తుచేయాలని ప్రణాళికలు రూపొందించారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ నాటి ఆ మహత్తర ఘటనను ప్రజలకు గుర్తుచేసేలా సెల్ఫీ కార్యక్రమం మొదలు పెట్టారు. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన నాటి ఫోటోను భారీ స్థాయిలో రూపొందించారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఓ గోడపై దానిని అతికించారు. ఆ భారీ పోస్టర్ ముందు నిలబడి భట్టి విక్రమార్క సెల్ఫీలు దిగారు. రాజశేఖర రెడ్డి పోస్టర్ ముందు దిగిన సెల్ఫీను భట్టి విక్రమార్క తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన అనేక ప్రాజెక్టును సందర్శించి అక్కడ సెల్ఫీలు దిగాలని భట్టివిక్రమార్క నిర్ణయించుకున్నారు. తద్వారా గులాబీ నేతలకు కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి విక్రమార్క సెల్ఫీ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రకటించారు. ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా గులాబీ నేతలు చేస్తున్న ప్రచారానికి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు భట్టి ఎంచుకున్న సెల్ఫీ మార్గం మంచి ఫలితాలను ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి కొన్ని వారాల క్రితం అమెరికా పర్యటన సందర్భంగా రైతులకు 3 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తే చాలు అని అర్ధం వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గులాబీ నేతలకు బ్రహ్మాస్త్రంగా మారింది. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారు. ఉచిత విద్యుత్ విధానంలో పేటెంట్ హక్కు తమదేనని భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. తాను చేసిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. BHEL, ECIL, HCU, DBL సంస్థలతో రాష్ట్రంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద కూడా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. వాటితో పాటు పాటు మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా సెల్ఫీలు దిగి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ధీటుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క సూచించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • PCC Chief revanth reddy
  • T congress
  • telangana
  • tpcc

Related News

KCR appearance before Kaleshwaram Commission postponed

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

KCR : “కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ప్రధాని మోదీ చెప్పాలి” – అనే మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

Latest News

  • Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్‌’లో ఆ హీరో..?

  • Gold Rates: గోల్డ్ రేట్ ఢమాల్..కొనుగోలుదారులకు ఇదే ఛాన్స్ !!

  • ‎Tulsi Plant: తులసి మొక్క ఎందుకు అంత పవిత్రంగా బావిస్తారు.. పండితులు ఏం చెబుతున్నారంటే?

  • ‎Karthika Masam: కార్తీకమాసంలో నారికేళ దీపం ఎందుకు వెలిగిస్తారు.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd