Telangana Congress : తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ..
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఎలక్షన్స్ పైనే ఫోకస్ చేశారు. ఏఐసీసీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది.
- Author : News Desk
Date : 09-09-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ(Telangana)లో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే పోటీ చేసే క్యాండిడేట్స్ ని కూడా ప్రకటించింది. కాంగ్రెస్(Congress) త్వరలోనే అభ్యర్ధులని ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్ కి తెలంగాణలో కొంచెం ప్రాబల్యం పెరిగింది. దీంతో అదే జోష్ తో ముందుకెళ్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఎలక్షన్స్ పైనే ఫోకస్ చేశారు. ఏఐసీసీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా షబ్బీర్ అలీ, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్, కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్ గా కుసుమకుమార్, ఎఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా బలరాం నాయక్, స్ట్రాటజీ కమిటీ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావులని నియమించారు.
ఒక్కో కమిటీలో కొంతమంది సభ్యులని కూడా ప్రకటించారు. తొమ్మిది మందితో ఎన్నికల నిర్వహణ కమిటీ, 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ, పది మందితో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, 12 మందితో పబ్లిసిటీ కమిటీ, 14 మందితో పబ్లిసిటీ కమిటీ, 9 మందితో కమ్యూనికేషన్ కమిటీ, 17 మందితో శిక్షణ కమిటీ, 13 మందితో స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నాయి ఈ కమిటీలు.
Also Read : Telangana: కాంగ్రెస్ తుక్కుగూడ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ