HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telangana Cm Sketch With Prashant Kishor On Ys Jagan

CM KCR: జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గండం? కేసీఆర్, పీకే స్కెచ్!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గిలిగింత‌లు పెడుతున్నారు.

  • Author : CS Rao Date : 04-11-2022 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP-BRS
Jagan Kcr Pk

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గిలిగింత‌లు పెడుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి మోడీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని కేసీఆర్ చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీదాహానికి అన‌వ‌స‌రంగా స‌హ‌కారం అందించానని `పీకే` ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. వీళ్లిద్ద‌రూ ఎందుకు ఏపీ సీఎం మీద అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో నిలిచింది.

వాస్త‌వంగా ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌తో ఢిల్లీ చ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మేర‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్, ఫామ్ హౌస్ కేంద్రంగా ప‌లు ర‌కాల స్కెచ్ ల‌ను వాళ్లిద్ద‌రూ ర‌చించారు. ఆ స‌మ‌యంలోనే ఏఐసీసీ చీఫ్ గా ఉన్న సోనియాను అప్ప‌ట్లో `పీకే` క‌లిశారు. యూపీఏ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో జ‌త క‌డితే ఆశించిన ఫలితం ఉంటుంద‌ని సూచించారు. ఆ దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తూ గాంధీ కుటుంబీకుల్ని ఇటీవ‌ల వెనకేసుకు వ‌స్తున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ మాత్రం `పీకే` వ్యూహాల‌కు అనుగుణంగా సంకేతాలు ఇవ్వ‌డంలేదు. ఇక్క‌డే కేసీఆర్, పీకే ల‌కు మండుతుంద‌ని వాళ్ల ఎత్తుగ‌డ‌లు గురించి బాగా తెలిసిన వాళ్లు ఊహిస్తున్న అంశం.

Also Read:   Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్ దే విజయం!

ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ఇద్ద‌రూ బీజేపీకి అన్ని విధాల స‌హ‌కారం అందించారు. ఇటీవ‌ల ముచ్చింత‌ల్ రామానుచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. పార్ల‌మెంట్ వేదిక‌గా 370ర‌ద్దు, పౌర‌స‌త్వం, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, నోట్ల ర‌ద్దు, జీఎస్టీ త‌దిత‌రాల‌న్నింటికీ టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు ఇచ్చింది. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఇటీవ‌ల విభేదించింది. అదే, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికీ ఎన్డీయే అడుగుల‌కుమ‌డుగులు ఒత్తుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నం బీజేపీకి అవ‌స‌రం ఉండ‌దు. కానీ, బీజేపీ మీద జ‌గ‌న్ కు అనుమానం క‌లిగిలా కేసీఆర్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం బీహార్ కేంద్రంగా జ‌న్ సురాజ్ పాద‌యాత్ర చేస్తోన్న రాజ‌కీయ వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం నితీష్‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఒకేసారి టార్గెట్ చేశారు. వాళ్లిద్ద‌రూ బీజేపీ కోసం ప‌నిచేస్తున్నార‌న్న యాంగిల్ లో మాట్లాడారు. బీజేపీ కోవ‌ర్టు గా నితీష్ ను ఫోక‌స్ చేస్తూ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డానికి స‌హ‌కారం అందించ‌కుండా కాంగ్రెస్ పార్టీ పున‌రుజ్జీవం చేస్తే బాగుండేద‌ని `పీకే` అన‌డం వెనుక ఆంత‌ర్యం మ‌రోలా క‌నిపిస్తోంది. బ‌హుశా బీజేపీకి దూరం కావాల‌ని `పీకే` ఇచ్చిన సందేశాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తిర‌స్క‌రించి ఉండొచ్చు. అందుకే ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్లు జ‌గ‌న్ మీద చేసి ఉంటార‌ని కొంద‌రు భావిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్, పీకే ఇద్ద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని బీజేపీకి దూరం చేసే ప్ర‌య‌త్నం ఇప్ప‌ట్లో ఫ‌లించ‌క‌పోవ‌చ్చు.

Also Read:  Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • prashant kishor
  • Telangana CM KCR
  • ts cm kcr
  • YS Jagan Mohan Reddy

Related News

Big update on local body elections in AP

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేడితో వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ (SEP/OCT) నెలల్లోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, భార

  • It is because of CM Chandrababu that it is not raining: Former Minister

    Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Latest News

  • Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

  • Kuwait Refinery: హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ హెచ్చరించడంతో.. కువైట్ రిఫైనరీ, బహ్రెయిన్‌లోని అమెరికా మౌలిక సదుపాయాలపై దాడి

  • China: చైనాను కుదిపేస్తున్న టైఫూన్ ‘బావి’ తుపాను

  • Siya Goyal: సియా గోయల్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను నిరూపించడానికి ఏమీ అవసరం?

  • Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd