Bandi Sanjay : ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు..!!
- By hashtagu Published Date - 05:59 AM, Tue - 22 November 22

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చేస్తున్న పోరాటానికి తాము కూడా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో బండిసంజయ్ దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ ను లక్ష్యం చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న బండి సంజయ్…కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆపణలకు బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నుంచి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాయి. ఈ మధ్యే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన నుంచి బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏ మాత్రం అవకాశం వచ్చిన అధికార పార్టీని ఉతికి ఆరేసేస్తోంది.