HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >T Sat Must Be Made A Partner In The New Telangana Education Policy Venugopal Reddy

T-SAT: తెలంగాణ నూతన విద్యా పాలసీలో టి-సాట్‌ను భాగస్వామిని చేయాలి: వేణుగోపాల్ రెడ్డి

సీఈవో అందజేసిన డాక్యుమెంట్‌ను పరిశీలించిన కేశవరావు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వయోజనులు, మహిళలతో పాటు ఇతర రంగాలకు టి-సాట్ అందిస్తున్న డిజిటల్ సేవలను ఆయన కొనియాడారు.

  • By Gopichand Published Date - 02:36 PM, Thu - 4 December 25
  • daily-hunt
T-SAT
T-SAT

T-SAT: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే విద్యా పాలసీలో టి-సాట్ (T-SAT)ను భాగస్వామిని చేయాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి విద్యా పాలసీ కమిటీ ఛైర్మన్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావును కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించనున్న ఈ నూతన విద్యా విధానంలో టి-సాట్ సేవలను వినియోగించుకోవడం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్‌లోని కేశవరావు నివాసంలో ఆయనను కలిసిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి, టి-సాట్ రూపొందించిన పాలసీ డాక్యుమెంట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన టి-సాట్ డిజిటల్ విద్యా ఛానళ్ల సేవలను వివరించారు. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ స్థాయితో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే అత్యుత్తమ కంటెంట్‌ను అందించి, దేశంలోనే డిజిటల్ విద్యా ఛానళ్లలో టి-సాట్ మొదటి స్థానంలో ఉందని సీఈవో గుర్తుచేశారు.

Also Read: Viral: పెళ్లి తంతు జరగకుండా చేసిన రసగుల్లా ..అసలు ఏంజరిగిందంటే !!

5 సంవత్సరాల విద్యార్థి నుండి 60 సంవత్సరాల వ్యక్తుల వరకు అవసరమయ్యే విద్యకు సంబంధించిన కంటెంట్ టి-సాట్ శాటిలైట్, యాప్, ఓ.టి.టి, సోషల్ మీడియా వంటి వివిధ డిజిటల్ ప్రసార మాధ్యమాల్లో అందుబాటులో ఉందని వివరించారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే 4.8 మిలియన్ల వ్యూస్‌తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ టి-సాట్ దేశంలోనే మొదటి స్థానాన్ని అధిరోహించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించబోయే నూతన ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తెలంగాణ సమాజానికి డిజిటల్ సేవలను అందించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని సీఈవో తెలిపారు.

కేశవరావు హామీ

సీఈవో అందజేసిన డాక్యుమెంట్‌ను పరిశీలించిన కేశవరావు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వయోజనులు, మహిళలతో పాటు ఇతర రంగాలకు టి-సాట్ అందిస్తున్న డిజిటల్ సేవలను ఆయన కొనియాడారు. తెలంగాణ నూతన విద్యావిధానంలో టి-సాట్ సేవలు తప్పనిసరిగా వినియోగించుకునే విధంగా పాలసీని రూపొందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • K Keshavarao
  • T-SAT
  • Telangana Education Policy
  • Telanganam Education News

Related News

Telangana Rising Summit

Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.

  • Cm Revanth Delhi Today

    CM Revanth Reddy to Visit Delhi : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

  • Telangana Rising Global Summit

    Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!

  • Telangana Global Summit

    CM Revanth Reddy Practices Football : మెస్సీ కోసం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్రైనింగ్!

Latest News

  • MLA Yarlagadda: యువ‌కుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?

  • Putin Staying Suite: ఐటీసీ మౌర్యలో కట్టుదిట్టమైన భద్రత.. పుతిన్ కోసం ‘చాణక్య సూట్’ సిద్ధం, ప్ర‌త్యేక‌త‌లీవే!

  • Akhanda 2 : తెలంగాణ లో ఈరోజు రాత్రి 8 గంటల నుండే అఖండ 2 ప్రీమియర్స్ ..టికెట్స్ ధరలు ఎలా ఉన్నాయంటే !!

  • Gambhir- Agarkar: టీమిండియాను నాశ‌నం చేస్తున్న అగార్క‌ర్‌, గంభీర్!

  • Gannavaram : రూ. 90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd