HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains Accompanied By Lightning For Three Days

AP Rains: 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Rains
Ap Rains

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల వడగళ్ల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 42 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. కొన్ని చోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

మరోవైపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

విజయనగరం, గజపతినగరం, అరకు, ఎస్. కోట, కొత్తవలస, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో కల్వర్టులు, కాలువలకు సమీపంలోకి వెళ్లవద్దని సూచించింది. అలాగే వడగాలులు వీచే ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • ap rains
  • Heavy Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh

Related News

Heavy rains in AP

Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వే

  • Heavy rain warning for these districts in Telangana!

    Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

  • Heavy rains in AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Widespread heavy rains across Telangana districts.

    Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Low-pressure area in the Bay of Bengal

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

Latest News

  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

  • Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

  • Imran Khan: ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల వాతావరణం లేకపోవడం’ కారణంగా PoK ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI పార్టీ ప్రకటించింది.

  • Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

  • Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd