Bandi Sanjay Son: మరో విద్యార్థిని కొట్టిన ‘బండి’ కొడుకు.. వీడియో వైరల్!
తాజాగా బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 12:04 PM, Wed - 18 January 23

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. హైదరాబాద్ లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కాలేజీలో ఓ విద్యార్థిపై చేసిన దాడి వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ (Bandi Sanjay) పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ సంజయ్ తన కుమారుడిని వెనకేసుకొచ్చి చిన్నపిల్లలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారంటూ మండి పడుతున్నాడు. మరో వైపు బాధిత విద్యార్థి ఓ అమ్మాయిని వేదించినందుకే తన కుమారుడు అతన్ని కొట్టాడని సమర్దించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే బండి కుమారుడి (Bandi Sanjay) వ్యవహరం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా, తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండి భగీరథ్, అతని స్నేహితులు ఓ రూం లో మరో విద్యార్థిని ఇష్టమొచ్చినట్టు కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఇప్పటి వరకు బండి సంజయ్ కానీ, భగీరథ్ కానీ స్పందించలేదు. అయితే నెటిజనులు (Nitizens) మాత్రం వారిద్దరిపై విరుచుకపడుతున్నారు.
భగీరత్ కాలేజీలో ఇంత అరాచకం సృష్టిస్తూ ఉంటే యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేస్తోందంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వీడియో కొత్తదా.. పాతదా? అనేది తెలియాల్సి ఉంది. భగీరథ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. కాగా ఈ వీడియో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV) సైతం రియాక్ట్ అయ్యాడు. ‘‘సద్దాం హుస్సేన్ కుమారుడు మళ్లీ పుట్టాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/DharaniR_/status/1615520363714338816?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1615520363714338816%7Ctwgr%5E7007f5853b6dd6b0144f327a11d9acea610b0553%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.teluguglobal.com%2Ftelangana%2Fbandi-sanjays-son-hit-another-studentanother-video-revealed-832945
Also Read: Traffic Restrictions: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!