Telangana : త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క
- Author : Sudheer
Date : 19-12-2023 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సీతక్క (Sithakka)..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. అతి త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల (14 Thousand anganwadi Jobs ) భర్తీ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క (Minister Sithakka).. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Also : CM Revanth Reddy : ఇవాళ, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. పర్యటన వివరాలివీ