BRS Silver Jubilee: బీఆర్ఎస్‌కు మరో షాక్.. రజతోత్సవ సభకు అనుమతి డౌటే ?
ఈనెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీస్ శాఖకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్(BRS Silver Jubilee) వినతిపత్రం ఇచ్చారు.
- By Pasha Published Date - 05:28 PM, Sun - 6 April 25

BRS Silver Jubilee: బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేసి 25 ఏళ్లు గడిచాయి. ఈసందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ శివార్లలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు చుక్కెదురైంది. అకస్మాత్తుగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈరోజు (ఏప్రిల్ 6) నుంచి సిటీ పోలీస్ యాక్ట్‌ను అమల్లో తెచ్చారు. ఇది 30 రోజులపాటు అమల్లో ఉండనుంది. అంటే మే 5వ తేదీ వరకు ఎలాంటి సభలు నిర్వహించేందుకు వీలుండదు. అందుకే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సభ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 30 రోజుల పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులను బ్యాన్ చేశామని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
Also Read :KTR Open Letter : ‘‘వాళ్లది రియల్ ఎస్టేట్ మనస్తత్వం’’.. కేటీఆర్ బహిరంగ లేఖ
వినయ్ భాస్కర్ వినతిపత్రం ఇచ్చినా..
ఈనెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీస్ శాఖకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్(BRS Silver Jubilee) వినతిపత్రం ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ స్పందించలేదు. మరోవైపు సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. అవసరమైతే సభకు అనుమతి పొందేందుకు బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా సిద్దిపేట ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో వివిధ ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనసమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు.
Also Read :BJP Formation Day : బీజేపీ 45 వసంతాలు.. కమలదళం ఎలా ఏర్పాటైందో తెలుసా ?
సిటీ పోలీస్ యాక్ట్ రూల్స్ ఇవీ..
సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్‌ను నిషేధించారు. మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరి. మైకులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకుని వినియోగించాలి.