HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Shock For Telangana Ration Cardholders

White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..

  • Author : Vamsi Chowdary Korata Date : 25-05-2026 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shock for Telangana Ration Cardholders
Shock for Telangana Ration Cardholders

తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు, నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పేరిట కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు మంజూరు చేయించుకున్న వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇన్నాళ్లూ వీరంతా తమ తల్లిదండ్రుల రేషన్‌కార్డుల్లో సభ్యులుగా కొనసాగడం వల్ల వీరి అసలు వివరాలు, ఆదాయం బహిర్గతం కాలేదు. ప్రస్తుతం డేటా విశ్లేషణ ద్వారా వీరి గుట్టు రట్టవడంతో అలాంటి వారి కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తాజా నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండి, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి కార్డులను తక్షణమే రద్దు చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి లేదా 7.20 ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి ఉన్న వారి రేషన్ కార్డులను కూడా ఏరివేస్తున్నారు. ప్రభుత్వ విచారణతో ఇన్నాళ్లూ లబ్ధి పొందిన అనర్హులైన కార్డుదారుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

అనర్హుల ఏరివేత ప్రక్రియలో నిజమైన పేదలకు, అర్హులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పంపిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాలో సాంకేతిక పొరపాట్ల వల్ల కొందరు అర్హుల పేర్లు కూడా నమోదయ్యాయి. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలుగా తప్పుగా చూపిస్తున్న వారి వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు బ్యాంకుల నుంచి వ్యాపార, వ్యక్తిగత రుణాలు పొందటం కోసం ఐటీ రిటర్న్స్‌లో లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలాంటి వారికి అధికారులు నేరుగా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు చెప్పిన సమాధానాలు, వారు సమర్పించిన పత్రాలపై విచారణ అధికారి సంతృప్తి చెందితే వారి కార్డులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద కార్డుల విషయంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారు చెప్పిన సమాచారం వాస్తవమా కాదా అనే అంశాన్ని అన్ని కోణాల్లో ఆరా తీస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Minister Revanth Reddy
  • congress party
  • government employees
  • telangana govt
  • White Ration Cards

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.

    CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd