CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేసుకుంటూ విమర్శలు చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
- By Kavya Krishna Published Date - 10:18 AM, Mon - 1 September 25

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేసుకుంటూ విమర్శలు చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, తన ఢిల్లీ పర్యటనల వెనుక కారణాలను స్పష్టంచేస్తూ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తీసుకున్న అప్పులనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నానని రేవంత్ తెలిపారు. రేవంత్ వివరించిన ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.87,449 కోట్ల భారీ అప్పులు తెచ్చిందని చెప్పారు. ఈ అప్పులు 11.5 శాతం వడ్డీ రేటుతో 14 ఏళ్ల కాలానికి తీసుకున్నవని, యూబీఐ, నాబార్డు వంటి బ్యాంకుల నుంచి రుణాలు సేకరించారని ఆయన వివరించారు. ఇప్పటివరకు అసలు, వడ్డీలు కలిపి రూ.49,835 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.60,769 కోట్లు మిగిలి ఉన్నాయని రేవంత్ తెలిపారు.
Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!
‘‘నేను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు. కానీ నా పర్యటనల ఉద్దేశ్యం ఒక్కటే. కేసీఆర్ తెచ్చిన 11.5 శాతం వడ్డీ రేటును 7.25 శాతానికి తగ్గించుకోవడమే. దీని వలన రుణాల చెల్లింపు గడువు 14 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెరిగింది. దీంతో రాష్ట్రానికి సంవత్సరానికి సుమారు రూ.13 వేల కోట్లు మిగులుతాయి’’ అని రేవంత్ వివరించారు. ఇక కేంద్రంతో సంబంధాలపై కూడా స్పందించిన ఆయన, ‘‘ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బిగ్ బ్రదర్. జెండా, అజెండా వేరు కానీ ఆయన ప్రధాని. రాష్ట్రానికి అవసరమైన నిధులు, సహాయం కోసం ప్రధాని వద్దకు వెళ్లడంలో తప్పేం లేదు. ఇతర దేశాలకు వెళ్ళేది కూడా పెట్టుబడిదారులను కలవడానికే. పరిశ్రమలు పెట్టమని అడిగితే తప్పేంటి?’’ అని అన్నారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కూడా సీఎం రేవంత్ దాడి చేశారు. ‘‘వందల ఎకరాల ఫామ్ హౌస్‌లు, పేపర్లు, టీవీలు ఎక్కడి నుంచి వచ్చాయి? లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? ఆ టెక్నిక్ ఏంటో కాస్త తెలంగాణ యువతకు చెప్పండి. మీ పిల్లలకు మాత్రమే ఆ నైపుణ్యం ఎలా వచ్చింది? సీఈ దగ్గరే వందల కోట్లు ఉంటే, సీఎం దగ్గర ఎంత ఉంటుందో బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అందుకే ఈ విషయంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో కాళేశ్వరం అవినీతిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిశ్శబ్దాన్ని కూడా రేవంత్ తప్పుపట్టారు. ‘‘ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల కనీసం కాళేశ్వరం విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్, హరీష్ రావుల అవినీతి, దుర్మార్గాలను చూస్తూ కూర్చున్నారు’’ అని రేవంత్ మండిపడ్డారు.
Bajaj Pulsar: బజాజ్ బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా పల్సర్.. మొత్తం అమ్మకాల్లో క్షీణత!