CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..
పలుమార్లు ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి
- By Sudheer Published Date - 03:29 PM, Mon - 8 April 24

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల వరుస ప్రమాదాల (Accidents) నుండి క్షేమంగా బయటపడుతున్నారు. పలుమార్లు ఆయన కాన్వాయ్ (Convoy) లోని వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఈ మధ్యనే రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఢిల్లీలో రాహుల్ జోడో సభకు వెళ్తుండగా.. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్లు సకాలంలో ల్యాండింగ్ చేశారు. దాదాపు గంటన్నర సేపు సీఎం రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అదే విమానంలో ఉండిపోయారు. అదృష్టంకొద్దీ ఏ ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈరోజు కొండగల్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ఓ కారు టైర్ భారీ శబ్దంతో పేలడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. ఏంజరిగిందో అని నేతలు , అధికారులు ఖంగారు పడ్డారు. కానీ టైర్ పేలి ఆ శబ్దం వచ్చిందని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. పేలిన టైర్లు రిపేరి చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్ కు బయలు దేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్ కు బయలు దేరారు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో పార్టీ శ్రేణులు , నేతలు ఖంగారుపడుతున్నారు.
Read Also : 6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన