Telangana Politics: వ్యవసాయం అంటే సినిమావాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు KTR
వ్యవసాయంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
- Author : Praveen Aluthuru
Date : 17-07-2023 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Politics: వ్యవసాయంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం అనుకున్నావా డ్రామారావు అంటూ ధ్వజమెత్తారు. అయినా ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే ఎవుసం అంటే జూబ్లీహిల్స్ బంగ్లాలో సేద తీరడం కాదని, సినిమావాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదని మండిపడ్డారు.
వ్యవ’సాయం’ అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు..
ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదు…
సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు…అది మట్టి మనసుల పరిమళం.
మట్టి మనుషుల ప్రేమ.
ఎడ్లు – వడ్లు అని ప్రాసకోసం పాకులాడే … ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన.… pic.twitter.com/wx5hXqy1TX— Revanth Reddy (@revanth_anumula) July 17, 2023
రాహుల్ గండి ఇటీవల రైతులతో కలిసి వరి నాట్లు వేయడం, ట్రాక్టర్ నడుపుతూ ఆ ఫొటోలోని ట్విట్టర్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ గా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ రాహుల్ పై విమర్శలు చేశారు. ఇక కేటీఆర్ విమర్శలపై ఈ రోజు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.
Read More: Chicken Blood-Honey Trap : కోడిరక్తంతో హనీ ట్రాప్..బిజినెస్ మ్యాన్ నుంచి కోట్లు వసూల్