Paddy Politics : బియ్యంలో కయ్యం…అసలు కథ!
వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్యవహారం ఉంది. ఆ కథేంటో చద్దాం..
- By CS Rao Published Date - 12:40 AM, Fri - 19 November 21

వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్యవహారం ఉంది. ఆ కథేంటో చద్దాం..
ఉదాహరణకు తెలంగాణ లో ఈ యాసంగిలో 100 క్వింటాల్స్ వడ్లు పండాయనుకుందాం. వాటిని మిల్లులో పడితే 65 క్వింటాల్స్ బియ్యం వస్తాయి. కానీ, యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది అందువలన ఉడకబెట్టి బియ్యం తీస్తారు. ఇలా ఐతే 80 క్వింటాల్స్ బాయిల్డ్ బియ్యం వస్తాయి. అంటే అదనంగా 15 క్వింటాల్స్ బియ్యం వస్తున్నాయి. ఇక్కడే అసలు బియ్యం కథలోని అసలు ట్విస్ట్.
కేంద్రం- రాష్ట్రం ఒప్పందం ప్రకారం ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి. ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు. కాని బాయిల్డ్ ఎప్పుడూ కూడా తక్కువ రాదు. మరి ఇక్కడ 15 క్వింటాల్స్ బియ్యం ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చాయని కేంద్రానికి చెప్పదు. ఉచితంగా కూడా ఇవ్వదు. ఆ 15 క్వింటాల్స్ బియ్యం కు కూడా సరిపడే వడ్లకు లెక్కను చూపిస్తుంది. అంటే 15 క్వింటాల్స్ బియ్యం రావడానికి 25 క్వింటాల్స్ వడ్లు కొన్నట్లుగా చూపుతుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం కొన్న వడ్లు 125 క్వింటాల్స్ అని అవాస్తవ లెక్క చూపుతుంది. అదనపు 25 క్వింటాల్స్ అప్పనంగా వచ్చినట్లే కదా!
Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే
అప్పనంగా వచ్చినా కూడా… కేంద్రం నుండి ప్రతి క్వింటాల్ కి మద్దతు ధర 1960/- మిల్లు చార్జి 250/- రవాణా చార్జ్ 250/- హమాలీ&సుతిలీ 60/-ఇతరములు 40/- మొత్తం : ₹ 2560/- కేంద్రం ఇస్తుంది. వాస్తవానికి ఈ కథలో తెలంగాణ రైతుల నుండి కొన్నది 100 క్వింటాల్స్ మాత్రమే. కాని కేంద్రానికి లెక్క చూపిస్తున్నది 125 క్వింటాల్. 25 క్వింటాల్స్ కి అప్పనంగా వస్తున్న ఆదాయం అక్షరాల ₹ 64000 /- ఇక అసలు తెలంగాణ పంటకు వద్దాం..
తెలంగాణ 2020 యాసంగి పంట 10000000 కోటి మెట్రిక్ టన్నులు. అంటే పది కోట్ల క్వింటాల్స్ 100000000 స్కాం ప్రకారం 125000000 తేడా 2500000 క్వింటాల్స్. కానీ, కేంద్రం నుండి రాష్ట్రం మాత్రం 125000000 x 2560 =320000000000 (ముప్పై రెండు వేల కోట్లు) వసూలు చేస్తుంది. వాస్తవానికి రైతులకు ఇచ్చేది100000000 x 1960 = 196000000000 (పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు) మాత్రమే. ఇక్కడ తేడా మిగిలేది 124000000000 (పన్నెండు వేల నాలుగు వందల కోట్లు) వీటి అన్నింటిని కొందరు రైస్ మిల్లర్లు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పంచుకుంటారు. ఇలా ఏడు సంవత్సరాల నుండి దందా కొనసాగుతున్నది.
అందుకే బాయిల్డ్ రైస్ వద్దన్నందుకు ఇంత రాద్దాంతం. ఇలాంటి నిజాలను బీజేపీ బయటపెడుతోంది. కానీ, కేంద్రంలో అధికారం వెలగబెడుతూ చర్యలు తీసుకోవడానికి రాజకీయ బంధాలు అడ్డుపడుతున్నాయి. అంతిమంగా రాజకీయ అవసరాలు వాళ్లు ఉద్దేశంలో గెలవాలి. రైతులు మాత్రం ప్రాణాలు విడుస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే..జై జవాన్..జై కిసాన్ అంటూ నినాదం వినిపించడం వరకు బీజేపీ పరిమితం అవుతోంది. ఇప్పటికైనా ఇలాంటి స్కాంల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల మధ్య బీజేపీ అభాసుపాలు కావడం తప్పదు.
Related News

Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.