HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ravula Chandra Shekar Reddy Joins Brs

Ravula Chandra Shekar Reddy : బిఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ..చంద్రశేఖర్ రెడ్డి ఫై గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

  • Author : Sudheer Date : 20-10-2023 - 5:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravula Chandrashekhar Reddy
Ravula Chandrashekhar Reddy

టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి (Ravula Chandra Shekar Reddy)..కేటీఆర్ (KTR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ..చంద్రశేఖర్ రెడ్డి ఫై గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ (TDP) పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని గులాబీ గూటికి చేరారు చంద్రశేఖర్.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రావుల.. ప్రస్తుతం టీడీపీ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. కానాయ పల్లి గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరి. అంచెలంచెలుగా ఎదిగారు. 1989 -1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో వనపర్తి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికలలో ఓడినా.. 2001లో రాజ్యసభ సభ్యునిగా ఆయన్ను టీడీపీ నామినేట్ చేసింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెలంగాణ ఆవిర్బావం తర్వాత.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా.. చంద్రబాబుకు నమ్మకంగా ఉంటూ ఆ పార్టీలోనే కొనసాగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించగా.. ఆయన మాత్రం బిఆర్ఎస్ లో చేరారు.రాష్ట్రంలో టీడీపీ బలపడకపోవటం, ఎల్ రమణ, ఎర్రబెల్లి వంటి సహచర నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి అధికార పార్టీలో చేరటంతో ఇక లాభం లేదని భావించి..చివరకు ఆయన కూడా వారి బాటలోనే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Read Also : Cheruku Sudhakar : కాంగ్రెస్ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Ravula Chandra Shekar Reddy
  • tdp

Related News

Ntr Sr

NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd