Cheruku Sudhakar : కాంగ్రెస్ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా
నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 20-10-2023 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్న తరుణంలో నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ లో నేతలు కాంగ్రెస్ (Congress) లోకి..కాంగ్రెస్ నేతలు , బిఆర్ఎస్ (BRS) లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లోకి చేరుతుండగా..కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు బిఆర్ఎస్ లోకి చేరుతున్నారు. రీసెంట్ గా పొన్నాల (Ponnala) వంటి సీనియర్ నేతలతో పాటు మరికొంతమంది గులాబీ తీర్థం పుచ్చుకోగా..తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చెరుకు సుధాకర్ రాజీనామా (Cheruku Sudhakar) చేశారు.
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి తీరు వల్లే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసారి తెలంగాణ లో ఎలాగైనా విజయం సాదించాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ అగ్ర నేత , ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో ప్రజలకు వివరిస్తూ..బిఆర్ఎస్ వైఫ్యల్యాలను ఎండగడుతున్నాడు.
Read Also : CM Jagan: జగన్ గుడ్ న్యూస్, అర్చకులకు కనీస వేతనం