Telangana Politics: బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ పై అనుమానం వ్యక్తం చేశారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేయడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- By Praveen Aluthuru Published Date - 04:51 PM, Wed - 21 June 23

Telangana Politics: తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ పై అనుమానం వ్యక్తం చేశారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేయడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి జంప్ అయిన తరువాత మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు.
గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరుతారనే వార్తలు వినిపించాయి. తన అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి సలహా మేరకు రాజగోపాల్ త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనే వార్తల నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి బీజేపీపై అనుమానం వ్యక్తం చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. అయితే తాను అనుమానిస్తున్నట్టు బహిర్గతం చేయకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది.
తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. ఇప్పటికే రాజకీయ పరంగా ఎవరి సన్నాహాల్లో వారున్నారు. అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మరోసారి ప్రజల్లో తమ గళం వినిపించనుంది. మరోవైపు బీజేపీ తెలంగాణాలో అధికారం చేపట్టేవిధంగా అడుగులు వేస్తుంది.
Read More: CM Jagan: ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రాఫ్ పెంచింది: సీఎం జగన్